Share News

కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 11 , 2026 | 11:44 PM

ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన అందించాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్మమని, అందుకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం

వేములవాడ, మే 11 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన అందించాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్మమని, అందుకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణం లోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గా నికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మోడల్‌ పాఠశాల ఏర్పాటు చేస్తున్నారన్నారు. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే క్యాపస్‌లో విద్య అందిస్తున్నారని తెలిపారు. ఆధునిక డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, స్మార్ట్‌ ల్యాబ్స్‌, మౌలిక వసతులు ఏర్పాటు చేశారని, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ తరహాలో క్యాంపస్‌ అభివృద్ది చేయడం ఈ స్కూల్‌కు పెద్ద ఆకర్షణ గా మారిందని వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాసం టెక్నాలజీ ఆధారిత అభ్యాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేష్‌, కౌన్సిలర్లు, ప్రధానోపాధ్యా యుడు, ఉపాధ్యాయులు, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:45 PM