పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 17 , 2026 | 12:50 AM
రాష్ట్రంలోని గూడు లేని ప్రతి కుటుంబానికి గూడు కల్పించి పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని గూడు లేని ప్రతి కుటుంబానికి గూడు కల్పించి పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండలంలోని బతికెపల్లిలో ఇందిరమ్మ పథకంలో నూతనంగా ఇల్లు నిర్మించుకున్న పెంట లక్ష్మీబాయి ఇంటిని శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. ఈ సందర్భంగా బతికెపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ పథకంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, అర్హులందరు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 149 గ్రామాల్లో బతికెపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని, సుమారు ఏడు వేల ఓటర్లు ఉన్న బతికెపల్లి గత పాలకుల నిర్లక్షానికి గురైందంటూ గ్రామంలో రోడ్లు, మురుగు నీటి కాల్వలు, పల్లె ధవాకాన, ఇతర మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అనంతరం సుద్దపల్లి , దోమలకుంట గ్రామాల్లో మహిళా సంఘ భవన నిర్మానాలకుమంత్రి లక్ష్మణ్ కుమార్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉందని, మహిళల ఆర్థిక సాదికారత లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ది సాదించాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు అందజేసి వారి ఆర్థిక ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన మహిళా సంఘాలకు భవనాలు నిర్మిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమాలలో సర్పంచులు ముంజ మహేశ్వరి, ఐతరవేని లక్ష్మణ్, బండారి మణెమ్మ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి, జిల్లా ఎస్‌సి డెవలప్‌మెంట్ అధికారి కె.రాజ్‌కుమార్, ఎస్‌సి కార్పోరేషన్ ఈ.డి ఎస్.కిషోర్, తహసీత్దార్ నిజాముద్దీన్, ఇంచార్జి ఎంపీడీవో శశికుమార్ రెడ్డి, పిఆర్ డిఈ అశ్విన్, హౌజింగ్ ఏఈ జ్యోతి, పార్టీ నాయకులు కృష్ణహరి, సంధి మల్లారెడ్డి, ఒరుగల శ్రీనివాస్, కర్ర భాస్కర్ రెడ్డి, కిషన్, తిరుపతి, మేరుగు శ్రీనివాస్, వెంకట్ రావు, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.