పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:39 AM
పేదల సొతింటి కల నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి) : పేదల సొతింటి కల నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మర్రిపల్లి, హన్మాజిపే ట గ్రామాలలోని ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు జంకె మధు, ఇల్లం దుల లాస్య పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.