Share News

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:44 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

వేములవాడ రూరల్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణం లోని 25 వార్డు, రూరల్‌ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌తోకలిసి ఆయన పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి జయహే తెలం గాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడు తూ పేద ప్రజల సంక్షేమమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నా రు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కోటి 15లక్షల మంది రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 5లక్షల జీవిత బీమా కల్పించనుంద న్నారు. రైతులకు ఏకకాలంలో 2లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. దేశంలో ఆంజనేయస్వామి గుడిలేని ఊరు లేదు ఇందిరమ్మ ఇల్లులేని గ్రామం ఉండదన్నారు. రాజకీయాలకు అతీతం గా పార్టీలతో సంబందంలేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు రాని ఇంకెవరైనా అర్హులు ఉం టే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 6కోట్ల రూపాయలతో భీమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. చెక్క పల్లి కంచుకుంటలోకి రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామన్నారు. చెక్కపల్లి-వట్టెంల రోడ్డు నిర్మాణ పనులు నిర్మాణంలో కొంత జాప్యం జరగ డంతో ఎస్టిమేషన్‌ ఖర్చు పెరిగిందన్నారు. రోడ్డు నిర్మాణానికి అదనంగా నిధులు మంజూరుచేసి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1303 ఇండ్లు పూర్తి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఆరు గ్యారెంటీల అమలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారి వివరాలను చదివి వినిపించారు. రాష్ట్రంలో త్వరలో విద్యార్థులకు అ ల్పాహార పథకం, మద్యాహ్న బోజన పథకం ఇంటర్మీడియట్‌ వరకు విస్తర ణ, ఇంటర్మీడీయట్‌ చదివే దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్‌ వాహనాలు అందజేయనున్నామన్నారు. వ్యవసాయ య్రాంతీకరణ పథకం కింద డ్రోన్‌ స్ర్పే యంత్రాన్ని వ్యవసాయశాఖ ఆద్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ అందజేశారు.

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

చెక్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ కలెక్టర్‌తో కలిసి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రొండి రాజు, వేముల వాడ మున్సిపల్‌ చైర్మన్‌ రొండి రాజు, చెక్కపల్లి సర్పంచ్‌ అడ్డిక లక్ష్మి, మున్సి పల్‌ వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, వార్డు కౌన్సిలర్‌ కొక్కుల బాలకృష్ణ(రాజు), మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, ఆర్డీవో రాధాబాయ్‌, డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమీషనర్‌ సంపత్‌కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి షర్ఫుద్దీన్‌, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం, ఈఈ పీఆర్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:44 AM