రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:13 AM
రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్ట్‌లో రూ. 51 లక్షలతో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు, అనంతరం 38 మంది లబ్ధిదారులకు 15 లక్షల 46 వేల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శం అని అన్నారు. కోనరావుపేట మండలంలో రెండు బ్రిడ్జిలకు సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయని, మరో బ్రిడ్జికి డ్రాయింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రహదారి నిర్మాణంతో పాటు అవసరమైన చోట్ల బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు సమకూరుస్తుం దని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం శిలాఫలకాలు వేయడం తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయలేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చాకాయల ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, నిజామాబాద్ సర్పంచ్ సింగం శ్రీహరి, ఉపసర్పంచ్ రాజు,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బోయిని దేవరాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానుక సత్యం, ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, నాయకులు ఫిరోజ్‌పాషా, చేపూరి గంగాధర్, గొట్టే రుక్మిణి, నాయిని ప్రభాకర్‌రెడ్డి, అప్పల నాగభూషణం, భాస్కర్‌రావు, కాంగ్రెస్ నాయకులు సాసాల రాజిరెడ్డి, అవురం సురేష్, బి బాలరాజు మురళి, బుర్ర రమేష్, సుంకరి మహేష్, సంజీవ్ మార్కెట్ కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.