అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 23 , 2026 | 12:42 AM
దేశంలోని ఇత ర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని, అందుకు తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు చే సిన తొలిసంతకాలే నిదర్శమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల, మే 22 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని ఇత ర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని, అందుకు తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు చే సిన తొలిసంతకాలే నిదర్శమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్‌లో జిల్లాస్థాయి సభ నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతేలు జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమా న్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందేశాన్ని వినిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రూ పొందించిన వీడియోను ప్రదర్శించారు. వివిధ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, అవగాహన సద స్సులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరలు, కల్యాణ్ లక్ష్మీ చెక్కులు, దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఉపాధి హామీ ద్వారా ఎంపీడీవోలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అం దజేశారు. చేనేత జౌళి శాఖ, సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ, ఉద్యానవన, మహిళా సంఘాలు మత్స్యశా ఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతి థులు, ప్రజాప్రతినిధులు స్టాళ్లను సందర్శించి అభినం దించారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మా ట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై, కేరళ ముఖ్యమంత్రి మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం పథకంపై సంతకాలు చేశారన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా ముందుకు పోతుందన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యమని అన్నారు. కులగణన చేసి దేశానికి తెలంగాణ రోల్ మో డల్‌గా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధి పను లు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాల వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు కలు గుతున్నాయని, కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. రైతుల కు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామన్నారు, విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌స్కూల్ మంజూరు అయిందని, రూ.200 కోట్లతో 20ఎకరాల్లో నిర్మిస్తున్నామని వెల్లడించా రు. నాణ్యమైన భోజనం, విద్య అందిస్తామని తెలిపారు. పేదలకు వైద్యం అందించాలని ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో 10 నూతన సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, రైతుల కు సులభతరంగా విద్యుత్తుమీటర్లు ఎన్పీడీసీఎల్ ద్వారా అందిస్తున్నామన్నారు. ఎక్కడో ఉండి ఏదో చేయాలని అనుకుంటే ఏమీకాదని, ప్రజల మధ్య అపోహలు సృష్టిం చాలని కొందరు అనుకుంటున్నారని, ఎన్ని కుట్రలు చేసి నా ప్రజా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథ కాలు ప్రజలకు చేరవేస్తున్నాయని తెలిపారు. ఎస్సీల వర్గీకరణ, బీసీల జనగణన చేశామని పేర్కొన్నారు. త్వర లో అమలుచేయనున్న ఇందిరమ్మ భీమా పథకం దేశం లో ఎక్కడా లేదని చెప్పారు. కార్మిక, ధార్మిక క్షేత్రం అభి వృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు పెట్టిన బకాయి లను ప్రజాప్రభుత్వం ఇచ్చిందని, సిరిసిల్లలో తయా రుచేసిన చీరలు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నా మని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో రెండో స్థానం...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. జిల్లాలోని అందరి సహ కారంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవు తున్నాయని తెలిపారు. రానున్న అన్ని ప్రజా పాల న ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అల్పాహారం పథకం, కుటుంబ జీవిత బీమా, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం పథ కం, దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పి డి, సేంద్రియ వ్యవసాయం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నదని తెలిపారు.ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబందనలపై అవగాహన కల్పించామని తెలి పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రంకెన్ డ్రైవ్, రాంగ్‌రూట్, హెవీస్పీడ్‌తో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటుచేసి చికిత్స, కౌన్సె లింగ్ ఇస్తున్నారన్నారు. వేసవిలో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు. సైబర్‌క్రైమ్ జరిగినప్పు డు వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని తెలిపా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు పుల్కం రాజు, జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్లు నరాల శేఖర్, దార్ల సందీప్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాజు, సబేరా బేగం, విజయ, ఆత్మ వేములవాడ డివిజన్ చైర్మన్ ముకుందరెడ్డి, ఆర్డీవోలు రాజేందర్‌రెడ్డి, కేఎస్ బీ కుమారి, డీఎస్పీ నాగేంద్రచారి, సీపీవో శ్రీనివాసాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.