గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:37 AM
గ్రామాలు అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
ఇల్లంతకుంట, మార్చి 8(ఆంధ్రజ్యోతి) : గ్రామాలు అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని తాళ్ళల్లపల్లె గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి, రేపాక గ్రామంలో మహిళా సంఘ భవనానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు గత ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో అనేక సమస్యలు పేరుకపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు విడుతల వారిగా చెల్లించడంతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నేడు మహిళలు అన్నిరంగాలలో ముందు ఉన్నారని, ఎంతోమంది మహిళలు చరిత్రలో తమకుంటు ఓస్థానానికన సాధించుకున్నారని పేర్కొన్నారు. మహిళలు అర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తుందన్నారు. కోటమంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ అనుఽరాధ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచులు మీసాల కనుకరాజు, కాథ మల్లేశం, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఎంపీడీఓ శశికళలతో పాటు వివిద గ్రామాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.