పేద ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:18 AM
పేద ప్రజ ల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి) : పేద ప్రజ ల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం రూరల్ మండలంలో 40, వేముల వాడ పట్టణ, అర్బన్ మండలాలలోని 126మంది లబ్ధిదారు లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తా మన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోటి 15లక్షల మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు త్వరలో 5లక్షల జీవిత బీమా కల్పించనున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యా విధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. పేద ప్రజల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేరుస్తున్నా మన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు వకులా భరణం శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.