అన్ని రంగాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:02 AM
ప్రజా ప్రభు త్వ హయాంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
వేములవాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభు త్వ హయాంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా పట్టణంలోని మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను, సర్వీస్ రోడ్డు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను, ఆయా భవనాల నిర్మాణానికి స్థలాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విప్ మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో ముంజూరైన బీసీ భవన్, ఎస్టీ భవన్, నిర్మాణ పనులు త్వరలోనే ప్రారం భం కానున్నాయని అన్నారు. నాలుగు భవనాలకు ఒక్కో భవనానికి రూ. 1.30 కోట్లు మంజూరుకు కేటాయించగా టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. భవన నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు విప్ సూచించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగ పడేలా నాణమైన సౌకర్యాలతో భవనాలన నిర్మించనున్న ట్లు తెలిపారు. మూడో బ్రిడ్జి పనులు తుది దశకు చేరు కున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసు కువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే పట్టణంలోని ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజల రాకపోకలు మరింత సులభత రం అవుతాయని చెప్పారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అభివృద్ధి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విప్ తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ..
ఆపదలో వున్న పేద, మద్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన 37 మంది లబ్దిదారులకు రూ. 13 లక్షల 57 వేలు, అర్భన్ మండలం పరిధిలోని 18 మంది లబ్దిదారులకు రూ. 5.66 లక్షల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్య క్షులు పాల్గొన్నారు.