Share News

పేదలకు అండగా నిలవాలనేది ప్రభుత్వ ఎజెండా

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:17 AM

పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తూ వారికి అండ గా నిలవాలనేది కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎజెండా అని ప్రభు త్వ విప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేదలకు అండగా నిలవాలనేది ప్రభుత్వ ఎజెండా

వేములవాడ రూరల్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తూ వారికి అండ గా నిలవాలనేది కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎజెండా అని ప్రభు త్వ విప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేవులవాడ మున్సిపల్‌ పరిధిలోని ఇస్లాంనగర్‌ లో ముస్లిం కమ్యునిటీ హాల్‌కు శంకుస్థాపన చేసి వేము లవాడ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం రంగు రంగుల బ్రోచర్లు చూపిస్తూ అభివృద్ధి ని అటకెక్కించారన్నారు. గత ఎన్నికల్లో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాన్ని చూపిస్తే తాము ఓట్లు అడగమని, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు లేని గ్రామాన్ని చూపిస్తే బీఆర్‌ ఎస్‌ నాయకులు ఓట్లడగడా నికి రావొద్దని తాము విసిరి న సవాల్‌కు బీఆర్‌ఎస్‌ నాయకులు స్వీకరించలేదన్నారు. ఎందుకంటే డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఒక నాటకమని ఆ పార్టీ నాయకులకు సైతం తెలుసునన్నారు. ఇందిరమ్మ ఇల్లులేని గ్రామం దేశంలోనే లేదంటే అతిశయోక్తి కాద న్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేదవాడికి వెన్నంటి నిలిచే పార్టీ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆలయ అభివృద్ధితోపాటు పట్టణాభివృద్ధి సమాంతరంగా జరుగుతున్నాయన్నారు. నియోజక అభివృద్ధికి ఎమ్మెల్యే గా తాను కట్టుబడి ఉంటే వెన్నుదన్నుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారు గృహప్రవేశానికి తమను ఆహ్వానిస్తూ కాంగ్రెస్‌ ప్ర భుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశీర్వదిస్తున్నా రన్నారు. నూతన వస్త్రాలు పెట్టి తమను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయ న్నారు. పట్టణంలోని పలు జంక్షన్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాన్నారు. గుడి చెరువులో బోటింగ్‌ సౌక ర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని అందుకోసం నిధులు సైతం మంజూరయ్యాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల అభివృద్ధి లక్ష్యం గా ముందుకు పోతున్నామన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడిని కాదని ప్రజల్లో ఉండే నాయకుడిన న్నారు. అనంతరం వేములవాడ రూరల్‌ మండలంలోని 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురా లు బొజ్జ భారతి, ఎమ్మార్వో అబూబాకర్‌, ఎంపీడీవో శ్రీని వాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:17 AM