దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:46 PM
దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గకేంద్ర కార్యాలయంలో శుక్రవారం నర్సక్కపేట గ్రామానికి చెందిన రాగటి శ్రీనివాస్, రాగటి శ్రావణ్‌లకు ద్విచక్ర వాహనాలను వికలాంగసంస్థ ద్వారా పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు అంగవైఖల్యం ఉందని ఎవరు అధైర్యపడవద్దని, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను అనేక మంది దివ్యాంగులు సాధించారని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు వివిద గ్రామాల నాయకులు పాల్గొన్నారు.