Share News

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

ABN , Publish Date - May 11 , 2026 | 12:05 AM

జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొను గోలు చేయడంతో పాటు హమాలీల కొరతను నివారించాలంటూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట రైతులతో ధర్నా చేయనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ ప్రకటించారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొను గోలు చేయడంతో పాటు హమాలీల కొరతను నివారించాలంటూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట రైతులతో ధర్నా చేయనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ ప్రకటించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని పెద్దూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆది వారం సీపీఎం నాయకులతో కలిసి సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ సందర్శించి పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడు తూ జిల్లాలో చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు విపరీతంగా పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్య లు తీసుకోకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని ఆరోపించారు. ఎండల్లో దినదిన గండంగా రైతన్నల పరిస్థితి మారిందన్నారు. వరి కోతలు కోసి 25 రోజులు దాటిపోయినా కూడా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కుప్పలుగా పోసిన ధాన్యాన్ని రోజూ నేర్పుతూ వడ దెబ్బలకు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. రైస్‌మిల్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడం లారీలు రాకపోవడం ముఖ్యంగా హమాలీ కార్మికుల కొరత వలన తూకం వేయడానికి రోజుల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపో తుందని భయపడి పోతున్న రైతుల బాధలు ప్రభుత్వానికి కనబడుట లేవన్నారు. రోజు రైతుల కోసమే అన్ని చేస్తున్నామన్న ప్రభుత్వాలు ప్రతి పంటకు ఇదే పరిస్థితి కొనసాగుతుందోన్నారు. పంట పండించడా నికి నాలుగు మాసాలు కష్టపడిన రైతుకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హమాలీ కార్మికులను ఏర్పాటు చేయాలని, వారికి సరైన వేతనం అందించాలని, రైస్‌మిల్‌లో వెంటవెంట దిగుమతి చేసే విధం గా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11వ తేదీన సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపడుతామన్నారు. రైతులు ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లా రెడ్డి జిల్లా నాయకులు సూరం పద్మ, అన్నదాస్‌ గణేష్‌, ఎలిగేటి రాజ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 12:05 AM