Share News

కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:27 AM

రానున్న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ సమావే శాల్లో ఎమ్మెల్యేలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి యెల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : రానున్న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ సమావే శాల్లో ఎమ్మెల్యేలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి యెల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ గ్రామపంచా యతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీ యూ) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికు లు ధర్నా చేపట్టారు. ఎర్రజెండాలతో సీఐటీయూ నాయ కులు, కార్మికులు నిరసనలు తెలిపారు. అనంతరం ఎమ్మె ల్యే క్యాంప్‌ కార్యాలయంలో సిబ్బందికి కార్మికులు, నాయ కులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి యెల్లారెడ్డి మాట్లా డారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చి న హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికుల కు వేతనాలను పంచాయతీల ద్వారానే చెల్లించాలని నిర్ణ యిస్తూ మార్చి 2న ప్రభుత్వం జారీ చేసిన జీవోని వెంట నే రద్దు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతినెల గ్రీన్‌ఛానల్‌ ద్వారా వేతనా లు చెల్లించాలని వారి ఖాతాలలో జమచేయాలన్నారు. పంచాయతీ కార్మికులకు ప్రతినెల రూ.9500ల వేతనాలు నెలల తరబడి చెల్లించకపోవడంతో పాటు ఇతర సమస్య ల పరిష్కారం కోసం ఆందోళనాలు పోరాటాలు చేసే పరి స్థితి నెలకొందన్నారు. కార్మికులందరికి ప్రతినెల వేతనం రూ. 26వేలు అందించాలని, మల్టీపర్సస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు అందించాలని రెండో పీఆర్‌సీ గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపచే యాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయా ల ముందు జీపీ కార్మి కులతో కలసి ధర్నా కార్యక్రమాలని చేపట్టడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే లంత బడ్జెట్‌ సమావేశా లలో ప్రభుత్వంపై ఒత్తి డి తీసుకురావలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మె ల్యేల క్యాంప్‌ కార్యాల యాల ఎదుట ధర్నా చే పట్టామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిం చాలని యూనియన్‌ ఆ ధ్వర్యంలో ఈనెల 17న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని హైదరాబాద్‌కు తరలివెల్లడానికి కార్మి కులు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యూని యన్‌ జిల్లా అధ్యక్షుడు బూర శ్రీనివాస్‌, కార్యదర్శి మల్యా ల నరసయ్య, రాజశేఖర్‌, శ్రీనివాస్‌, రవి, మల్లయ్య, బిక్షప తి, అంజయగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:27 AM