గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , Publish Date - May 29 , 2026 | 11:57 PM
నష్టపోయిన గీత కార్మకులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. కోరుట్ల మండలంలోని అయిలాపూర్, చిన్నమెట్‌పల్లి గ్రామాల్లో ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈతవనాలను గీత కార్మికులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
కోరుట్ల రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి): నష్టపోయిన గీత కార్మకులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. కోరుట్ల మండలంలోని అయిలాపూర్, చిన్నమెట్‌పల్లి గ్రామాల్లో ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈతవనాలను గీత కార్మికులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఎమ్మెల్యే సంజయ్ గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. రెండు గ్రామాలకు చెందిన గీత కార్మిక సంఘానికి 40,000 రూపాయల ను అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, సర్పంచ్‌లు నత్తి రాజుకుమార్, బాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు వనతడుపు అంజయ్య, నాయకులుత తుక్కారెడ్డి, సందయ్యలతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి రూరల్: మండలంలోని మెట్లచిట్టాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఈత వనాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు గీతకార్మికులను అడిగి తెలుసుకున్నారు. జీవనోపాధి కోల్పోయిన గీతకార్మికులకు తక్షణ సహయం కింద గ్రామానికి రూ. 20వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమించి పెంచుకున్న ఈత చెట్లు అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరమన్నారు. గీత కార్మికులు ఆందోళన చెందవద్దని, తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు సుంకేట గంగాధర్, బద్ధం శేఖర్‌రెడ్డి, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు పాల్గొన్నారు.