Share News

విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - May 18 , 2026 | 12:49 AM

విద్యాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

సిరిసిల్ల, మే 17 (ఆంధ్ర జ్యోతి): విద్యాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ విజయోత్సవం ముగింపు సందర్భంగా ఆది వారం కలెక్టరేట్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరయ్యారు. విద్యా ర్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ లో ఉత్తమ ప్రతిభ చూపినవారితో పాటు వివిధ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌లో రాణించిన విద్యార్థులకు నగదు ప్రోత్సా హకాలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. పదో తరగతి, ఇంటర్‌లో 11 మంది విద్యార్థులు అత్యధిక మా ర్కులు సాధించగా, లక్ష రూపాయలు ప్రోత్సాహం కింద అందజేశారు. తక్కువ సెలవులు తీసుకుని బడికి హాజ రుఅయిన టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సమ్మర్‌ క్యాంపులు ప్రారంభించామని, 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇటీ వల సర్పంచులకు కూడా విద్యా ప్రాధాన్యంపై వివరిం చామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని పెం పొందించేలా కార్పొరేట్‌కు దీటుగా బోధన, వసతులు ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, కాస్మొటిక్‌, డైట్‌ చార్జీలు పెంచామని గుర్తు చేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సన్మానిస్తున్నామని తెలిపారు. 10 వేల టీచర్‌ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసిందని, బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తుందని వెల్లడించారు. అన్నివర్గాల ప్రయోజనమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంద ని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయ వంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.

విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది

- కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యా ర్థులను చూస్తే గర్వంగా ఉందని కలెక్టర్‌ గరిమ అగ్రవా ల్‌ అన్నారు. అన్ని సౌకర్యాలను విద్యార్థులు సద్వినియో గం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అభి నందనలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి తాము ఎక్కడి నుంచి వచ్చినా పూర్తిస్థాయిలో తమ సామర్థ్యం విని యోగించుకున్న వారు మంచి స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. ఏదైనా ఒక రంగంలో స్థిరపడాలని ఆకాంక్షిం చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల వివరాలతో ఫ్లెక్సీలు రూపొందించి విద్యా సం స్థల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యాల యాల్లో ఎంతో ప్రతిభ ఉన్న టీచర్లు, మంచి వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. విద్యా శాఖ వారోత్సవాల సందర్భంగా జిల్లాలో సైన్స్‌ ల్యాబ్‌లు, అద నపు తరగతులు, ఇంకుడు గుంతలు ప్రారంభించామని, విద్యార్థులకు రెమెడీయల్‌ తరగతులు నిర్వహించామని, గ్రంథాలయ దినోత్సవం, సమ్మర్‌ క్యాంపులు విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడ్డా యని, పిల్లలు ఎన్నో అంశాల్లో తమ ప్రతిభ చూపారని తెలిపారు. విద్యార్థులు దిన పత్రికలు, పుస్తకాలు చదవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూపరెడ్డి, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, పలు మండలాల ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 12:49 AM