ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:31 AM
పీఆర్సీ ని ప్రభుత్వ వెంటనే ప్రక టించి అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి సత్యానంద్ అన్నా రు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పీఆర్సీ ని ప్రభుత్వ వెంటనే ప్రక టించి అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి సత్యానంద్ అన్నా రు. ఆదివారం పట్టణంలోని గీతనగర్ జడ్పీహెచ్‌ఎస్‌లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాసభ జరిగింది. ఈసందర్భంగా సత్యానంద్ మాట్లాడుతూ ప్రభు త్వాలు వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని పెండింగ్‌లో ఉన్న డీఏ లను, బకాయిలను వెంటనే మంజూరు చేయా లని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సిం గ్, గెస్ట్‌ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేత నం కల్పించాలన్నారు. మరో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇ వ్వాలని, అడ్మిషన్లు చేయాలని గురుకుల ఉపా ధ్యాయులపై ఒత్తిడిని తగ్గించాలని, గురుకుల్లా లో, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కేర్ టేకర్లను నియమించి ఉపాధ్యాయుల బోధనేతర పనుల నుండి విముక్తి కల్పించాలని, ప్రతి గురుకులాని కి ఇద్దరు హెల్త్ ఆఫీసర్లును నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుండమనేని మ హేందర్‌రావు,ప్రధానకార్యదర్శిగా జంగిటి రాజు, ఉపాధ్యక్షులుగా అంబటి రమేష్, నెల్లుట్ల లత, కోశాధికారిగా తిరుపతిజాదవ్, కార్యదర్శులుగా గాలిపెల్లి సంతోష్, తుమ్మనపెల్లి నరేష్, పాము ల స్వామిగౌడ్, కొత్వాల్ ప్రవీణ్, జెల్ల అర వింద్, సుంకే అంబేడ్కర్, చేకుట రాజశేఖర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ వంగ మల్లేశంలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ నాయ కులు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.