రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:47 AM
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చే యించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు.
బోయినపల్లి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చే యించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. బోయినపల్లి మండలం మిడ్ మానేరు ప్రాజెక్టును ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఓ పక్క కరువు విళయ తాం డవం చేస్తున్నా రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వివిధ ప్రాజెక్టులకు మిడ్ మానేరు గుండెకాయ కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిగా తగ్గి పోయి ఎడారిని తలపిస్తోందన్నారు. కరువు ఏర్పడినప్పుడు సాగు భూములకు నీటిని అందించే మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చాడన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం మరమ్మతుల పేరిట కాలయాపన చేయవద్ద ని, తక్షణమే కాఫర్ డ్యాం నిర్మించి కాళేశ్వరం ద్వారా మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, నాయకులు గుంటి శంకర్, అనుముల భాస్కర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గురజాల కోటి, బూర్గుల నందయ్య, మహమ్మద్ అజ్జు, నాగుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.