పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:46 AM
ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాన ప్రాధా న్యం ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాన ప్రాధా న్యం ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూత న గ్రామ పంచాయతీ భవనానికి విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తు న్న పలు సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆద ర్శంగా తీసుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోం దన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. 24 వేల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 24వేల కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు అందించామని ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ప్రస్తు తం సుమారు 9.96లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. రేషన్ కార్డును కేవలం సరుకుల కోసం కాకుండా పేద కుటుంబాలకు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. పేదలు కూడా సంపన్నులతో సమానంగా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడు తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్ప టికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. గత పాల నలో రాష్ట్రంపై భారీగా అప్పుల భారం పడిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను కొనసాగిస్తున్నామన్నారు.
కొచ్చేరు చెరువు అభివృద్ధికి కృషి
తన రాజకీయ ప్రస్థానంతో ఆశిరెడ్డిపల్లెకు విడదీయ రాని అనుబంధం ఉందని విప్ తెలిపారు. 1995లో కొచ్చేరు చెరువుకు గండి పడిన తర్వాత, తాను జడ్పీటీ సీగా ఉన్న సమయంలో 1996లో పాదయాత్ర చేసి చెరువు మరమ్మతులకు రూ.45లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కొచ్చేరు చెరువులోకి నీటిని తీసుకురావడానికి కాలువ నిర్మాణం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. కాలువ కోసం భూమి కోల్పోయే రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రచెరువు, పటేల్ చెరువు, కొచ్చేరు చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపడితే మండలం లోని సుమారు 18 గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. వేములవాడ నియోజకవర్గ అభి వృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిం దని ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మూడో వంతెన నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. రాజ న్న ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం తనకు లభించిన అరుదైన అవకాశంగా భావిస్తున్నానన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కూడా అందులో భాగమని తెలిపారు.
చందుర్తి మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం గర్వకారణమ న్నారు. ఎన్నికలు కేవలం 15 రోజుల రాజకీయ పోటీ మాత్రమేనని, అనంతరం అందరూ కలిసికట్టుగా ప్రజల కోసం పని చేయాలని సూచించారు. తాను నాలుగు సార్లు ఎన్ని కల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం పొందానని గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు తన ఎమ్మెల్యే పద విని అంకితం చేశానన్నారు. ప్రజల సహకారంతో వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొజ్జ మల్లేశం, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, నాయకులు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, చింతపంటి రామస్వామి, అంచే రాంరెడ్డి, కటకం మల్లేశం, దూది శ్రీనివాసరెడ్డి, నల్మసు భూమిరెడ్డి, బాబు, దేవ స్వామి, రాజయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.