Share News

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:59 AM

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవ లంబిస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవ లంబిస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లాడారు. పది సంవత్సరాలు తెలంగాణను సశ్యశ్యామలం చేస్తే ఓర్వలే క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కేసీఆర్‌ను బదనాం చేశారని, అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డి ఎన్నో మాట్లాడా డని ఆరోపించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభు త్వం వడ్లు కొనకపోయినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొన్ని బ్యాంక్‌లలో డబ్బులు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు లను బతికించుకున్నారన్నారు. ఈరోజు ఏ ఆటంకం లేకు న్నా రైతు బంధు వేయం లేదన్నారు. అన్ని రకాల వడ్లు కొంటానని క్వింటాల్‌కు రూ. 500లు బోనస్‌ ఇస్తానని రేవంత్‌రెడ్డి బోకస్‌ మాటలు చెప్పి ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రం బోనస్‌ ఇస్తామని జీవో తీసుకొచ్చా డని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడో వంతు ధాన్యం కొని కేంద్ర ప్రభుత్వ వడ్లు కొనడం లేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తుందని ఆరో పించారు. 2014కు ముందు కోటి 30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే కేసీఆర్‌ పాలనలో రెండు కోట్ల 35 లక్ష ల ఆయకట్టు పెరిగిందన్నారు. ఈరోజు 70 లక్షల రైతాం గాన్ని ముంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయ త్నాలు చేస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలోని ప్రజలకు, రైతాంగానికి అండగా ఉంటుందన్నారు.

వ్యవసాయంపై సీఎం సవతి తల్లి ప్రేమ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవసాయం, రైతుల పట్ల సవితి తల్లి ప్రేమను పక్కనబెట్టి ప్రస్తుత కరువు పరి స్థితులలో వ్యవసాయానికి, రైతులకు అండగా ఉండాలని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందరావు అన్నారు. తెలంగాణ ఉద్యమమే నాడు మా నీళ్ళు మా నిధులు, మా ఉద్యోగాలు, మా వ్యవసాయం నినాదంతో ప్రారంభ మైందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 60శాతం వ్యవసా యం పైనే ఆధారపడి ఉన్నారని వారందరి బతుకులను కాంగ్రెస్‌ ప్రభుత్వం బజారులో పడేసిందన్నారు. ఫూచర్‌ సిటీ, గాంధీ సరోవర్‌ కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తుతుందని దానిపై చూపిన ప్రేమ తెలంగాణ రైతాంగం మీద ఎం దుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యవసాయాన్ని నిలబెట్టాలని చూస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కొ క్కటిగా నరుకుంటూ వస్తున్నారని ఆరో పించారు. 33సన్నాలకు బోనస్‌ ఇస్తానని ఏడు మాత్రమే ఇస్తానని మాటమార్చా డని మొన్నటి యాసంగిలో రైతులకు బోనస్‌ ఇవ్వలేదని విమర్శించారు. ఎక రం రెండు ఎకరాలను ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు వేసి ఊరుకున్నారని అన్నారు. వ్యవసాయంపైన రేవంత్‌రెడ్డికి ప్రేమలేదని, కాళేశ్వరాన్ని పండబెట్టాడు ఆరోపించారు. రైతులు పండించిన పంట ధాన్యం మొత్తం కొనేవరకు ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, రైతులు అప్రమత్తంగా ఉం డాలన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని నమ్మి వ్యవసాయం చేస్తే ఇబ్బందులు అవుతాయన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి తుల ఉమ, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, గ్రంథాలయం జిల్లా మాజీ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, నాయకులు కృష్ణారెడ్డి, గజబీంకార్‌ రాజన్న, బొల్లి రామ్మోహన్‌, కుంభాల మల్లారెడ్డి, రవి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:59 AM