Share News

ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:21 AM

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి లేకుండా చేసిందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసిన ప్రభుత్వం

ఇల్లంతకుంట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి లేకుండా చేసిందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఆదివారం కేటీఆర్‌ ఆత్మీయ భరోసా కార్యక్రమం జరిగింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సంవత్సరానికి రూ 12వేలు ఇస్తామని మోసం చేస్తే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రమాదభీమా సౌకర్యం కల్పిస్తున్నాడని అదే విదంగా చల్మెడ ఆరోగ్య హెల్త్‌కార్డులను అందించి అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు ఎంతో కష్టపడ్డారని వారి కష్టాన్ని గుర్తించిన నాటి సీఎం కేసీఆర్‌ టాక్సీలను మాఫీ చేసిన ఘనత ఉందన్నారు. మహిళలకు ఉచితబస్సును తాము వ్యతిరేకించడం లేదని, కాని ఆటోకార్మికులకు సైతం ఉపాధిమార్గాలు చూపించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు.బీఆర్‌ ఎస్‌ పార్టీ ఆటోకార్మికులకు అండగా ఉంటుందన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అయినందున ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ సిద్దం వేణు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహ్మారెడ్డి, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌, నాయకులు బొల్లి రాంమోహన్‌, కేవీఎన్‌రెడ్డి, ఉడుతల వెంకన్న, మరిజ మోహన్‌రావు, కట్ట వెంకటరెడ్డి, రాగటి రమేష్‌, సావనపెల్లి అనీల్‌కుమార్‌, కూనబోయిన రఘు, ప్రశాంత్‌, మధులతో పాటు వివిద గ్రామాల నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 02:21 AM