గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:56 AM
జిల్లాలోని పలు సమ్మక్క-సారలమ్మ గద్దెలపై గురువారం అమ్మవార్లు కొలువుదీరారు.
ధర్మపురి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి ): జిల్లాలోని పలు సమ్మక్క-సారలమ్మ గద్దెలపై గురువారం అమ్మవార్లు కొలువుదీరారు. ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నదీ తీరాన గల మోరీల వాగు పక్కన జరిగే సమ్మక్క-సారలమ్మ జాత రకు భక్తులు బారులుతీరారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేసి నిలువెత్తు బంగారం సమర్పించారు. భక్తు లు పూజారి బైరబోయిన వెంకటయ్య నుంచి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్ పాల్గొన్నారు. ధర్మపురి మున్సిపల్ కమిషనర్ మామిళ్ల శ్రీనివాస్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహేష్, బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల ప్రత్యేక అధికారి ద్యావళ్ల కిరణ్‌కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శంకర్‌రాజు భక్తులకు సేవలు అందించారు.
ఫ గొల్లపల్లి: గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామం లో సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. గురువారం ఎక్కల్‌దేవి గుట్ట అవతలి నుంచి అశేష భక్త జనం వెంటరాగా కోయ పూజారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల నడుమ, శివసత్తుల పూనకాల నడుమ సమ్మక్క తల్లిని భక్తిశ్రద్దలతో గద్దె వరకు ఊరేగింపుగా తీసుకు వచ్చారు. వన దేవతలకు ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అసౌకర్యం కల్గకుండా సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎస్సై కృష్ణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
ఫ పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలో గురువారం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు వైభవం గా కొనసాగు తున్నాయి. ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీవో శశికుమార్ రెడ్డి, ఎస్‌ఐ కిరణ్ కుమార్‌లు సమ్మక్క, సారలక్కలకు మొక్కులు చెల్లించారు.
ఫ ఎండపల్లి: మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో సమ్మక్క తల్లి గురువారం గద్దెలపై కొలువుదీరింది. భక్తుల కు ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఫ వెల్గటూర్: వెల్గటూర్ శివారులోని చిలుకలయ్య గుట్ట (పెద్ద గుట్ట) వద్ద సమ్మక్క, సారలమ్మల మహా జాతర గురువారం వైభవంగా నిర్వహించారు.
ఉత్సవ కమిటీ సభ్యులు, కోయ పూజారులు సమ్మక్క తల్లిని వనం నుండి గద్దె పైకి తీసుకువచ్చారు. ఎస్సై ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫ కథలాపూర్: మండలంలోని బొమ్మెన-గంభీర్‌పూర్ గ్రామాల మధ్య కొలువైన సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరిగింది. వనదేవతల గద్దెల వద్దకు భక్త జనం చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.