రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:00 AM
ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘాల పాలకవర్గ సభ్యులు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చే యాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు.
చందుర్తి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘాల పాలకవర్గ సభ్యులు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చే యాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు. చందుర్తి, సనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గసికంటి ప్రభాకర్, ఎగోలం శ్రీనివాస్, పాలకవర్గ సభ్యుల అభినం దన సభలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతి థిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కళ్లతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సాగునీరు, నాణ్యమైన విద్యుత్, పంటలకు గిట్టుబా టు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించడం, కనీస మద్దతు ధరతో పంటలను కొనుగో లుచేయడం ద్వారా రైతుల్లో నమ్మకం పెరిగిందన్నారు. సాగునీటి వనరు ల అభివృద్ధి, చెరువులకు నీటి సరఫరా, ఎత్తిపోతల పథకాల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో గతంలో నిలిచిపోయిన అభి వృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఊపునిచ్చామన్నారు. విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, వంతెనలు, విద్యుత్ వంటి రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించా రు. రైతుల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు పులి సత్తయ్య, గొడిగె లావణ్య-అనిల్, బొజ్జ మల్లేశం, చిలుక బాబు, మార్కెట్ కమిటి చైర్మన్లు చెల్కల తిరుపతి, రొండి రాజు, అత్మ కమిటి చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, నాయకులు నాగం కుమార్, పొద్దు పొడుపు లింగరెడ్డి, అంచ రాంరెడ్డి, గొట్టె ప్రభాకర్, చింతపంటి రామస్వామి, దూది శ్రీనివాసరెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, ఇవదూరి మధు, చిలుక త్రిభువన్, సంతపూరి బాలు, గండి నారాయణ, గట్ల మీనయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించిన విప్
రుద్రంగి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలకేంద్రంలో సుమారు రూ.42లక్షలతో నిర్మిం చిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించా రు. తహసీల్దార్ పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఉప సర్పంచ్ మాడిశేట్టి అభిలాష్, గట్ల మీనయ్య, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్రెడ్డి, పుట్కపు మహిపాల్, కేసిరెడ్డి నర్సారెడ్డి, ఆకుల గగన్, ఎర్రం ఆరవింద్ తదితరులు పాల్గొన్నారు.