Share News

సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:08 AM

జిల్లాలో సైబర్‌ నేరాల ని యంత్రణే లక్ష్యంగా సైబర్‌ వారియర్స్‌ పనిచేయడంతో పాటు ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలని అదనపు ఎస్పీ చంద్రయ్య కోరారు.

సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సైబర్‌ నేరాల ని యంత్రణే లక్ష్యంగా సైబర్‌ వారియర్స్‌ పనిచేయడంతో పాటు ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలని అదనపు ఎస్పీ చంద్రయ్య కోరారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఎస్పీ మహేష్‌బీగీతే ఆదేశాల మేరకు సైబర్‌ వారియర్స్‌తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సైబర్‌ నేరాలపై సమీక్షించి కేసులకు సంబంధించి పలు సూచనలు అందించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాల బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో నియమించిన సైబర్‌ వారియర్స్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలన్నారు. సైబర్‌ నేరస్థుల ద్వారా మోసపోయిన వ్యక్తులు డబ్బులు బ్యాంకులో ఫ్రీజ్‌ అయితే వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రజలు సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే ఎస్‌సీఆర్‌పీ పోర్టల్‌తోపాటు పోలీస్‌ స్టేషన్‌లలో ఉన్న సైబర్‌ వారియర్స్‌ను సంప్రదించాలని కోరారు. సమావేశంలో సైబర్‌ ఆర్‌ఎస్‌ఐ జూవైద్‌, సైబర్‌ వారియర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:08 AM