Share News

సమస్యల పరిష్కారమే పోలీసుల లక్ష్యం

ABN , Publish Date - May 25 , 2026 | 11:54 PM

ప్రజలతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ మహేష్‌ బిగీతే అన్నారు.

సమస్యల పరిష్కారమే పోలీసుల లక్ష్యం

సిరిసిల్ల అర్బన్‌, మే 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజలతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ మహేష్‌ బిగీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో 41మంది బాధితులతో మాట్లా డి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజ లకు పోలీస్‌ సేవలు మరింత చేరవ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్య లు పరిష్కరించే విధంగా కృషిచేస్తామన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బం ది పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చిన ఫిర్యాదుదారులతో మార్యాదపూర్వకంగా ప్రవర్తించి అవసరమైన క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం వారికి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరు గా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకరావడంతో సాధ్యమైనంత త్వర గా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 11:54 PM