Share News

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:16 AM

జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐ ఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవం తంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీ లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ సూచించారు.

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

సిరిసిల్ల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐ ఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవం తంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీ లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ సూచించారు. బుధవారం కలెక్టరే ట్‌లో ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధు లు, సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో 549 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 55 మంది బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, 549మంది బీఎల్‌వోలు ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో 475694 మంది ఓటర్లు ఉండగా, 228579 మంది పురుషులు, 247072 మహిళలు, 43 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారని వెల్లడించారు. వీరిలో 404414 మంది మ్యాపింగ్‌ పూర్తిఅయిందని, ఇంకా 71280మంది మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సంద ర్శన ఉంటుందని, జూన్‌ 30 వతేది వరకు ఓటర్‌ జాబితాలో ఉన్న ఓటర్ల అందరికీ బీఎల్‌ఓ లు వచ్చి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇస్తారన్నారు.

ఫారం సమర్పించి రశీదు పొందాలి

బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సమ ర్పించాలని, అలాగే ప్రస్తుత పాస్‌ పోర్ట్‌సైజ్‌ ఫొటో తప్పనిసరిగా అందజేసి.. రసీదు పొందాల ని కలెక్టర్‌ సూచించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన బీఎల్‌వో ఎవరో ప్రజలకు తెలిసే లా చర్యలు తీసుకుంటామని తెలిపారు.పారాలు నింపడంలో సహాయం అందించాలని ఆదేశించా రు. ఫారాలతో పాటు ఎలాంటి గుర్తింపు కార్డుల జిరాక్స్‌ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్డు వివరాలు బీఎల్‌ఓలకు ఇవ్వాలని సూచించారు. జూలై 31న డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ అవు తుందని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్‌ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. డ్రాఫ్ట్‌ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్‌ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. ఆ సమయంలో భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం పుట్టిన సంవత్సరాన్ని ఆధా రంగా తీసుకుని అవసరమైన పత్రాలు సమర్పిం చాల్సి ఉంటుందని చెప్పారు.సెప్టెంబర్‌ 28,202 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరి ష్కరించి, అక్టోబర్‌ 1, 2026న తుది ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపా రు. అక్టోబర్‌1, 2026ను ప్రామాణిక తేదీగా తీసు కుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించడమే ఈ కార్యక్ర మం ప్రధాన లక్ష్యమని తెలి పారు. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్‌వోలు మూడు సార్లు సందర్శిస్తారని చెప్పా రు. ఓటర్లు ఎన్నికల కమిష న్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఎన్యూమరేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని పూరిం చవచ్చని తెలిపారు. డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

బీఎల్‌ఏలను నియమించుకోవాలి

ప్రతి రాజకీయ పార్టీలు బూత్‌ స్థాయిలో బీ ఎల్‌ఏలను నియమించి..వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. దేశంలో అర్హు లైన ఓటరు ఒకేచోట ఓటుహక్కు కలిగి ఉండా లనేది ఎన్నికల సంఘం లక్ష్యమని స్పష్టం చేశా రు. ఒక వ్యక్తి ఒక చోట కాకుండా ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగి ఉండడం నేరమని తెలిపారు. ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌వోలకు బీఎల్‌ ఏలు సహకరించాలని కోరారు.జిల్లాలోని ఓటర్లు అందరూ తమవద్దకు వచ్చే బీఎల్‌ఓలకు సహక రించి.. తమ వివరాలు, ఫారాలు అందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిరిసిల్ల, వేముల వాడ ఆర్డీవోలు శ్రీధర్‌ బాబు, కేఎస్‌బీ కుమారి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీఆర్‌ ఎస్‌ ప్రతినిధులు మ్యాన రవి,రాజన్న, ఎన్నికల విభాగం అధికారులు,రాజకీయ పార్టీల ప్రతినిధు లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:16 AM