Share News

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:13 AM

ప్రజలతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజలతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ మహేష్‌ బీ గీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లాపోలీస్‌ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో 26 మంది బాధితులతో మా ట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరవ చేయడమే లక్ష్యంగా, ప్రజా సవ స్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చిన ఫిర్యాదుదారులతో మార్యాదపూర్వకం గా ప్రవర్తించి అవసరమైన క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధి తులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదా రులకు పోలీస్‌ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకరావ డంతో సాఽధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కారించేలా చూస్తామన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 12:13 AM