Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:25 AM

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వివిధ శాఖల ద్వారా నిరంతరంగా ప్రభుత్వ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తు న్నామని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌

- నిరంతరంగా అభివృద్ధి, సంక్షేమం

- సిరిసిల్ల నేతన్నలకు చీరల ఉత్పత్తి ఆర్డర్‌

- వేములవాడలో అభివృద్ధి పనులకు రూ. 980 కోట్లతో ప్రతిపాదనలు

- 309 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌

-

గణతంత్ర వేడుకల్లో సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వివిధ శాఖల ద్వారా నిరంతరంగా ప్రభుత్వ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తు న్నామని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించి, పోలీస్‌ గౌరవ వందనం స్వీకరిం చారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ శాఖలు శకటాలు, స్టాల్స్‌ ఆకట్టు కున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈ సంవత్సరం వివిధ శాఖలకు సంబంధించిన 3,074 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద 1,26,278 మంది రైతులకు రూ. 149.27 కోట్లు ఇవ్వడం జరిగిందని, రైతు రుణమాఫీ పథకం ద్వారా 46,492 మంది రైతులకు రూ.370.75 కోట్ల లాభం చేకూరిందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 3.59 కోట్ల జీరో టికెట్లపై మహి ళలు ఉచిత ప్రయాణం చేశారని అన్నారు. ఆహార భద్రతా కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు రూ 500లకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 96వేల 104 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.

ఫ ఇందిరా మహిళాశక్తిలో రూ.382.97 కోట్ల లింకేజీ

ఇందిరా మహిళా శక్తి కింద వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలలో మెప్మా ద్వారా రూ. 2 కోట్ల 10 లక్షలతో 102 ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసినట్లు జరిగిందని తెలిపారు. తొమ్మిది మండల సమాఖ్యల ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. 2,837 స్వయం సహాయక బృందాలకు రూ 382.97 కోట్లతో బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇప్పించామన్నారు. అర్హత గల మైనారిటీ మహిళలకు మొదటి విడతగా 495 కుట్టుమిషన్లు పంపిణీ చేశామని అన్నారు. గృహ జ్యోతిపథకం కింద మార్చి 2024 నుంచి డిసెంబర్‌ 2025 వరకు 21,65,626 జీరో బిల్లులు జారీ చేసి, రూ 84.32 కోట్లు చెల్లించడం జరిగిందని అన్నారు. స్వంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో 7,408 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 185 ఇళ్ల నిర్మానం పూర్తయినట్లు తెలిపారు.

ఫ వేములవాడలో అభివృద్ధి పనులు

రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ది, బద్ధి పోచమ్మ ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, నిత్య అన్నదాన సత్రం నిర్మాణం, గుడి చెరువు అభివృద్ధి, బోటింగ్‌తో పాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వారి సహకారంతో నాంపల్లి గుట్టపైన యుద్ద విమానం ఏర్పాటు మొద లగు అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 291 కోట్లు మంజూరు కాగా, ఇంకా వివిధ అభివృద్ధి పనుల కోసం రూ 980 కోట్ల తో ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలం దరికీ 24 గంటలు అత్యవసర వైద్య సేవలకు 12 వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఫ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రోత్సాహం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 6.22 కోట్ల మీటర్ల ఇంది రమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్‌ ప్రభుత్వం అందించిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో కార్మికులకు నిరంతరం ఉపాధి అందుతుందన్నారు. నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తున్నా మని తెలిపారు. ప్రభుత్వం వేములవాడలో రూ. 50 కోట్ల కార్పస్‌ ఫండ్‌తో నూలు బ్యాంక్‌ ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. జిల్లాలోని అపెరల్‌ పార్క్‌లో గోకుల దాస్‌ ఇమేజెస్‌, పంక్చువేట్‌ వరల్డ్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు రూ. 9 కోట్ల పెట్టుబడితో ప్రారంభిం చామని తెలిపారు. 1900 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు. 309 ఎకరాలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రెసిడెన్షియల్‌ పాఠశాలకు రూ.200 కోట్లు మంజూరు

ఫ విద్యకు ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటి గ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణంలో భాగంగా వేములవాడ నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. బాలిక సాధికా రిక లక్ష్యంతో నడుస్తున్న 13 కేజీబీవీ విద్యాలయాల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ కోర్సు, ఎంసెట్‌ ఇతర పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. 486 పాఠశాలలో ఐసీటీ ల్యాబ్స్‌ల ద్వారా ఎఫ్‌ఎల్‌పీల ద్వారా డిజిటల్‌ మాధ్యమంలో 38 వేల మంది విద్యార్థులకు బోధించడం జరుతుందని అన్నారు. ఎస్సీ ,ఎస్టీ,బీసీ, మైనారిటీ, హాస్టళ్లలో డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలు ప్రభుత్వం భారీగా పెంచడం జరిగిందని తెలిపారు. కామన్‌ డైట్‌ ద్వారా నాణ్యమైన పౌష్ఠికాహారం అందిం చడం జరుగుతున్నది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు రూ 1.81 కోట్లు ,ప్రయోగశాలల అభివృద్దికి ఒక్కో కళాశా లకు రూ. 50 వేల చొప్పున మంజూరు అయినట్లు తెలిపారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా జిల్లాలో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలిపారు.

ఫ సన్నాలకు రూ. 3.59 కోట్ల బోనస్‌

ప్రస్తుత ఖరీఫ్‌లో 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించి రూ. 645 కోట్లు 49 వేల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. సన్న రకాల వడ్ల బోనస్‌ రూ.500 చొప్పున రూ 3.59 కోట్లు 1541 మంది రైతులకు చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో 1,94,415 రేషన్‌ కార్డులు ఉండగా, 5,71,958 మందికి ప్రతి నెల 665 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2025 జనవరిలో 22,068 వేల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామ న్నారు. కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్‌ కింద 1,050 మంది గీత కార్మికులకు ఉచితంగా కిట్లు అందించా మని అన్నారు. జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 348 చెరువుల్లో కోటి 36 లక్షల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై నీటిలో వదలడం జరిగిందని అన్నారు. 5 చెరువులలో 29.80 లక్షల మేలు రకాలైన రొయ్య పిల్లలను విడుద లకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఫ జిల్లాలో వృద్ధులకు డే కేర్‌ కేంద్రం

వృద్ధుల కోసం జిల్లాలో ఆశ్రమాలు ఏర్పాటు చేసి 41 మందికి సేవలు అందించడం జరుగుతుందని, వృద్దుల డేకేర్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు కలెక్టర్‌ తెలిపారు. 25మంది ట్రాన్స్‌ జెండర్స్‌కు గుర్తింపు కార్డులు అందించామని, సఖి కేంద్రం ద్వారా 1364 కేసులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ అందిం చడం జరిగిందని తెలిపారు. ఆర్థిక స్వావలంబన పథకం క్రింద దివ్యాంగులకు పెట్రోల్‌ పంపు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 104 మంది దివ్యాం గులకు రూ.96.89 లక్షలు సబ్సిడీ అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.. అనాథ పిల్లల కోసం నెలకు రూ. 4 వేల చొప్పున 112 మందికి మిషన్‌ వాత్సల్య పథకం కింద స్పాన్సర్‌ షిప్‌ అందించడం జరిగుతుందని, ఆరోగ్య లక్ష్మిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో 18,838 మంది 6 నెలల నుం చి 3 ఏళ్ల పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్‌, 16 గ్రుడ్లు టేక్‌ హోం రేషన్‌గా అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 8 నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించినట్లు తెలిపారు. వేములవాడలో నూతన ఐసీడీఎస్‌ భవనాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో 1,16,612 మంది వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికు లు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఇతరులకు 25.60 కోట్ల చేయూత పెన్షన్‌ కింద పంపిణీ చేయ డం జరుగుతుందని అన్నారు. భూ సమస్యల పరి ష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2025లో నూతన భూభారతి చట్టం అమలులోకి తెచ్చిందన్నారు. భూమి కొలతల సమస్యల పరిష్కారానికి జిల్లాలో 66 మంది లైసెన్స్‌ సర్వేయర్లను నియమించడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్యానికి ప్రథ మ ప్రాధాన్యం ఇస్తూ 1203 మంది మల్టీ పర్పస్‌ వర్క ర్లను నియమించి, ప్రతి నెలా రూ 9500 చొప్పున చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 9 నూతన జీపీ భవనాలు నిర్మించడం జరిగిందని అన్నా రు. సిరిసిల్ల, వేములవాడలో జంక్షన్ల సుందరీకరణ, వివిధ వార్డులలో ఆధునిక మరుగుదొడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అమృత్‌ 2.0 పథకం కింద మంచి నీటి సరఫరా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మహేష్‌ బి గితే,అదనపు కలెక్టర్‌ నగేష్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్టీవోలు వెంకటేశ్వర్లు, రాధా బాయ్‌, డిఎస్పీ నాగేంద్ర చారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:25 AM