Share News

పేదలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:35 AM

పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగు తుందని, అర్హత గల ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంక్షేమ పండుగలా మార్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మందికి చేయూత కింద పింఛన్లు అందించనున్నా మని, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను మరికొన్ని కుటుం బాలకు వర్తింపజేస్తామన్నారు. శనివారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ప్రాంగణంలో గల పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతా కాన్ని ఎగురవేశారు.

పేదలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం

- అర్హత గల ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు

- చేయూత కింద కొత్తగా పింఛన్లు

- గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు మరికొందరికి

- త్వరలోనే పూర్తి కానున్న పెద్దపల్లి బస్‌ డిపో

- రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

- రూ.700 కోట్లతో రత్నాపూర్‌ వద్ద కోకాకోలా పరిశ్రమ

- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగు తుందని, అర్హత గల ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంక్షేమ పండుగలా మార్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మందికి చేయూత కింద పింఛన్లు అందించనున్నా మని, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను మరికొన్ని కుటుం బాలకు వర్తింపజేస్తామన్నారు. శనివారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ప్రాంగణంలో గల పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతా కాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వంద నాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మనకు స్వాతం త్య్రం సిద్ధించిందని వారందరికీ నివాళులర్పిస్తున్నానని తెలి పారు.

ఫ చేయూత పథకం కింద కొత్తగా పింఛన్లు..

చేయూత పథకం కింద కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 2,46,981 రేషన్‌ కార్డులపై 7.18 లక్షల మందికి ప్రతీ నెలా 4,548 టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం కింద 1.19 లక్షల మందికి రూ.500కే సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్లు అంద జేస్తున్నామని, కొత్తగా మరి కొందరికి లబ్ధి చేకూర్చుతామ న్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలకు 245 కోట్ల 27 లక్షల రూపాయలు ఆదా అయ్యాయని అన్నారు. గృహజ్యోతి కింద 1,40,116 కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి 141.64 కోట్ల రూపాయలు అందించామ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో 7,199 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. 5,982 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు వారి ఖాతాల్లో 135 కోట్ల రూపాయలను జమ చేశామన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న 186 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు.

ఫ రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వరికి బదులు ప్రత్యా మ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించామన్నారు. 50 శాతం సబ్సిడీ జీలుగ, జనుము, ఇతర పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై అందించామన్నారు. రైతుభరోసా కింద 1,53,582 మంది రైతుల ఖాతాల్లో 161.38 కోట్లు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం కింద 65,757 రైతుల ఖాతాల్లో 13.15 కోట్లు జమ చేశామన్నారు. సన్నరకం ధాన్యాన్ని పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇచ్చామన్నారు. 2025-26 వానాకాలం సీజన్‌లో 845.89 కోట్లు, యాసంగి సీజన్‌లో 1,057 కోట్ల రూపాయల విలువైన 4.46 లక్షల టన్నుల ధాన్యాన్ని కొను గోలు చేశామన్నారు. ఆయిల్‌పామ్‌ పంటను ఈ ఏడాది 571 ఎకరాలకు విస్తరించామన్నారు. పెద్దపల్లి ప్రజల చిర కాల కోరికైన ఆర్టీసీ బస్‌డిపో సీఎం రేవంత్‌ రెడ్డితో సాకారం అయ్యిందని, 8.40కోట్ల రూపాయలతో డిపో నిర్మాణ పనులు నడుస్తున్నాయని, త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు.

ఫ రూ.22 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 22 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామన్నారు. డిజిటల్‌ విద్యలో జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 2,71,415 ఎకరాల్లో వరి, పత్తి, తదితర పంటలు సాగు కానున్నాయని, ఎస్సారెస్పీ, చిన్న నీటి వనరుల ద్వారా, రామ గుండం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని అందిస్తు న్నామన్నారు. రావుల చెరువు, అయ్యగారి చెరువు పున రుద్ధరణ పనులు నడుస్తున్నాయని తెలిపారు. విద్యుత్‌ శాఖ ద్వారా 75,257 వ్యవసాయ కనెక్షన్ల ద్వారా 24 గంటల విద్యు టత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. నంది మేడారంలో 51.28 కోట్లతో 7,682 కిలోవాట్ల సోలార్‌ మోడల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 27 ఈవీ చార్జీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఫ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం..

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. మహిళాశక్తిలో భాగంగా 15 బస్సులను కొనుగోలు చేశామన్నారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. రంగంపల్లిలో నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి 703 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 90,540 మంది పింఛన్లు ఇస్తున్నామని, వీబీజీరామ్‌జీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు 80 లక్షలతో రెండు యూనిట్లను నెలకొల్పా మని, 4754 ఇందిరమ్మ ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు 101.45 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులు నడుస్తున్నాయన్నారు. యువతకు జిల్లా ఉపాధి కార్యాల యం, టాస్క్‌ సెంటర్‌, గోఫ్లై, ఇండియన్‌ ఆర్బీ అగ్నివీర్‌, తదితర సంస్థల ద్వారా 2872 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.

ఫ అభివృద్ధి పనులకు పెద్దపీట..

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. హ్యామ్‌ మొదటి దశలో 141 కిలోమీటర్ల మేర 44 రహదారి పనులను చేపడుతున్నామని, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తు న్నాయన్నారు. పట్టణాభివృద్ధి కింద అమృత్‌ 2.0 కింద 311 కోట్లు, యూఐడీఎఫ్‌ కింద 201 కోట్లు, డీఎంఎఫ్‌టీ కింద 88 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాల పనులు చేపట్టామన్నారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా 21 రహదారి పనులను 574 కోట్లతో, డీఎంఎఫ్‌టీ నిధులతో 19 రహదారుల పనులు చేపట్టామన్నారు. పెద్దపల్లి-కూనారం ఆర్‌వోబీ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గోదావరిఖని, పెద్దపల్లి కోర్టు భవనాలకు 104.81 కోట్లు, రామగుండం ఆసుపత్రికి 160 కోట్లు, మంథనిలో ఎన్‌ఏసీ భవనానికి 20 కోట్లు, విశ్రాంతి భవనానికి 4.50 కోట్లు మంజూరు చేయగా పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. 82 కోట్లతో పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయ న్నారు. మంథని నియోజకవర్గంలోని రత్నాపూర్‌ వద్ద 700 కోట్లతో కోకాకోలా పరిశ్రమను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా పారిశ్రా మిక అభివృద్ధికి ఇది కీలకంగా మారనున్నదని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 01:35 AM