విద్యుత్ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం
ABN , Publish Date - May 01 , 2026 | 12:53 AM
విద్యుత్ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని ఎన్‌పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నా రు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని ఎన్‌పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నా రు. ఇందులో భాగంగా వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్ర తా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో గురువారం విద్యుత్ భద్రతకు సం బంధించిన పోస్టర్‌లు, కరపత్రాలను అధికారులు, విద్యుత్ సిబ్బందితో కలిసి సీఎండీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓ, ఎం విభా గాల సిబ్బందితో మాట్లాడి నిర్ధారిత భద్రత పరికరాలను సక్ర మంగా వినియోగిస్తున్నారా అనే విషయాన్ని స్వయంగా పరిశీ లించారు. విద్యుత్‌లైన్ల నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టి వినియోగదారులకు అంతరాయరహితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా అందించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజ లు, రైతులకు విద్యుత్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పిం చాలని ఆదేశించారు. సమావేశాలు, ప్రచార కార్యక్రమాలతో భఽధ్రత ప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ భద్రత అనేది కేవలం శాఖ బాధ్యత మాత్రమే కాదని అది ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయవచ్చునన్నారు. విద్యుత్‌కు సంబంధించిన ఏ ప్రమాద సూచన గమనించినా ఆలస్యం చేయకుండా వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల న్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రోజు 24 గంటలు అందు బాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్ 1912కు వెంటనే సంప్రదించాలని వినియోగదారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ వేణు మాధవ్, ఎస్‌ఈ డీపీఈ శ్రీకాంత్, డీఈలు అంజయ్య, రమణ, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.