Share News

గిరిజన తండాలకు రవాణా సౌకర్యమే లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:15 AM

గిరిజన తండాలు, మారుమూల గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

గిరిజన తండాలకు రవాణా సౌకర్యమే లక్ష్యం

రుద్రంగి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): గిరిజన తండాలు, మారుమూల గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో మొత్తం రూ.7.07కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రుద్రంగి ప్రధాన రహదారి నుంచి కుక్కలగండి తండా వరకు రూ.4.57 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి, మరో రూ. 2.50 కోట్లతో బీటీ రోడ్డు, హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనప్రాంతాల్లో రహదారుల నిర్మా ణం కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సుమా రు రూ.740కోట్ల నిధులు కేటాయించినట్లు తెలి పారు. వేములవాడ నియోజకవర్గంలోని గిరి జన తండాలకు రోడ్‌ కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు రూ.100 కోట్ల నిధులు కేటాయించా మని వెల్లడించారు. తొలివిడతలోనే సుమారు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు వివరించా రు. పనులు గడు వులోపు నాణ్యతా ప్రమాణాలతో పూ ర్తయ్యేలా ఇంజనీ రింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్య క్రమంలో ఆది కార్తిక్‌, తహసీల్దార్‌ పుష్పలత, సర్పంచ్‌ గండి నారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్‌ మాడి శెట్టి అభిలాష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, తర్రె మనోహర్‌, గడ్డం శ్రీని వాస్‌రెడ్డి, దర్న మల్లేశం, ఇప్ప మహేష్‌, పూదరి మహిపాల్‌, ఎర్రం ఆరవింద్‌, గంధం మనోజ్‌, వంగ మనోజ్‌, తంగేళ్ల రాహుల్‌; బోల్లి దేవేందర్‌, పల్లి గంగాధర్‌, తర్రె లింగం, దయ్యాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

కోనరావుపేట : గ్రామాల అభివృద్ధితో పాటు గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మండలంలో ని భూక్యరెడ్డితండాలో గిరిజన ప్రత్యేక నిధుల ద్వారా కోటి రూపాయల సీసీ రోడ్డు పనులకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఎస్సీ,ఎస్టీ సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ బుధ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచనల మేరకు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వరలక్ష్మి, కాంగ్రెస్‌ నాయకుడు కేతిరెడ్డి జగన్మోహ న్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌లు చేపూరి గంగాధర్‌, బొమ్మన భాస్కర్‌రావు, మండల అధ్యక్షుడు మా నుక సత్యం, భూక్యరెడ్డి తండా సర్పంచ్‌ నరేష్‌ నాయక్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:15 AM