Share News

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:44 AM

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

చందుర్తి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు. చందుర్తి మండలం ఎనగల్‌, లింగంపేట గ్రామాల్లో నూతన 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వ్యవ సాయరంగాన్ని బలోపేతం చేయడంలో విద్యుత్‌ కీలక పాత్ర పోషిస్తుం దన్నారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. దివం గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ అందిం చేందుకు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇప్పటికీ కొనసాగుతుండ టం రైతు సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆ పథ కం వల్ల చిన్న, సన్నకారు రైతులు ఎంతో లాభపడుతున్నారన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో లోవోల్టేజ్‌ సమస్యలను పూర్తిగా నివారిం చి, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించాలనే లక్ష్యంతో నూతన సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రైతులు సాగునీటి కోసం విద్యుత్‌పై ఆధారపడుతున్న నేపథ్యంలో, పంటల సమయంలో ఎలాం టి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఇళ్లకు కూడా సౌకర్య వంతంగా విద్యుత్‌ మీటర్లను అందించే విధానాన్ని అమలు చేస్తున్నా మని, పంచాయతీ కార్యదర్శి అనుమతితో మీటర్‌ మంజూరు చేసే ప్రక్రియను సరళీకృతం చేసినట్లు చెప్పారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో విద్యుత్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 10నూతన, రాజన్న ఆలయానికి ప్రత్యేక సబ్‌స్టేషన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అదనంగా రుద్రంగి వద్ద 132 కేవీ, కథలపూర్‌లో 220 కేవీ హై కెపా సిటీ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో 14 సబ్‌ స్టేషన్ల అభివృద్ధికి ఆమోదం లభించిందని తెలిపారు. గత పాలకులు పదేళ్ల కాలంలో ఒక్క సబ్‌ స్టేషన్‌ కూడా మంజూరు చేయలేకపోయారని ఆరోపించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ రంగంలో విస్తృత మార్పులు తీసుకువస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అశినిపర్తి శోభరాణి-సుధాకర్‌, కొక్కుల నరేష్‌, కరీంనగర్‌ సూపరింటెండెం ట్‌ ఇంజనీర్‌ రవీందర్‌, వేములవాడ డివిజన్‌ ఇంజనీర్‌ వెంకటరమణ, ఎంఆర్టీ డివిజనల్‌ ఇంజనీర్‌ చంద్రమౌళి, రాజం, మాజీ జడ్పీటీసీ సభ్యు లు నాగం కుమార్‌, నాయకులు చింతపంటి రామస్వామి, ఎనగంటి శంకర్‌, లింగంపల్లి సత్తయ్య, లాండే తిరుపతి, ముస్కు ముకుందరెడ్డి, ఎనగంటి అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:44 AM