నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:53 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు, ప్రభుత్వ పాఠ శాలల్లో చదు వుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించ డమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగు తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాల అగ్రికల్చర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు, ప్రభుత్వ పాఠ శాలల్లో చదు వుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించ డమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగు తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి నివేదనలో భాగంగా నిర్వహి స్తున్న 99రోజుల కార్యాచరణలో భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం జిల్లాకేం ద్రంలోని స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సంద ర్భంగా విద్యార్థుల తో కలిసి వారు అల్పాహారం చేశా రు. అనంతరం మంత్రి లక్ష్మణ్‌కు మార్ మాట్లా డుతూ ప్రజాప్రభుత్వంలో విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు అల్పాహారం అందించడానికి చర్యలు చేపట్టా మని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు అల్పాహారం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణి, జిల్లా సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, ప్రిన్సి పాల్ గునుక శ్రీలత, మాజీ ఛైర్మెన్ గిరినాగ భూషణం, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, కౌన్సిలర్ దుమాల రాజ్‌కుమార్ ఉన్నారు.