పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:37 AM
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడు తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకా హారం అందించడంతో పాటు ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను తల్లుల మాదిరిగా అంగన్‌వాడీ టీచర్లు సంరక్షిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చిన్నారుల్లో వినికిడి లోపం, మాటలు రాకపోవడం, శారీ రక ఎదుగుదలలో సమస్యలను చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించడం ముఖ్యమని తెలిపారు. గతంలో గుర్తించిన కొంత మంది చిన్నారులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, సరోజినీదేవి, ఈఎన్‌టీ వంటి ఆసుపత్రు లకు పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీవో కే ఎస్ బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్‌కుమార్ తదితరులు ఉన్నారు.