నేతన్నలకు చేతినిండా పని కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:05 AM
సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పనికల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరు గుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పనికల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరు గుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌లోని చేనేత విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణిలతోపాటు వివిధ పార్టీల నాయకులు, వస్త్రోత్పత్తిదారులు పూలమాలు వేశారు. అనంతరం చేనే త వాక్ నిర్వహించారు, అనంతరం సిరిసిల్ల మార్కెట్ యార్డ్‌లో చేనేత దినోత్సవ సభ నిర్వహించారు.ఇటీవల నూతనంగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికైన అధ్య క్షులను సన్మానించారు. చేనేత వస్త్రాలను ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 170 నిమిషాల్లోనే అగ్గిపెట్టలో ఇమిడే పట్టుచీర నేసిన సిరిసిల్ల నేత కళాకారుడు ఎల్దీ హరి ప్రసాద్‌తో పాటు పలువురు కళాకారులను సన్మానించా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మా ట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల నేత కార్మికులు భీవండి, షోలాపూర్, ముంబైలాంటి ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లేవారని, సంక్షోభ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతన్నలకు ధైర్యం, అండగా నిలిచారని, 13వేల అంత్యోదయ కార్డులు అం దించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తుంద ని తెలిపారు. ప్రభుత్వం నేతన్నలకు చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు అందిస్తూ నమ్మకాన్ని కలిగించిందన్నా రు. ధార్మిక, కార్మిక జిల్లాగా ఉన్న సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్‌ను నేత కార్మిక జీవన శైలి ప్రతిబించే విధంగా ఏర్పాటు చేసిందన్నారు. సిరిసిల్లలోని నేతన్నలు, కార్మికు లు, ఆసాములు, యజమానులకు సంవత్సరంలో సుమా రు 8 నెలల పాటు పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత సంవత్సరం 6కోట70 లక్ష లకు పైగా మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కి ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. త్వరలో మరో కోటి 50 లక్ష లకు పైగా మీటర్లకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ప్రభుత్వపాఠశాలల విద్యార్థుల యూ నిఫాంలు, ఇతర అవసరాలకు సంబంధించిన వస్త్రాల ఉత్పత్తి ద్వారా కూడా స్థానిక నేతన్నలకు పని కల్పిస్తు న్నామన్నారు. నేతన్నల సంక్షేమం కోసం త్రిఫ్ట్ పథకం ద్వారా కార్మికుల పొదుపునకు ప్రభుత్వం చేయూతని స్తోందన్నారు. నేతన్నల బీమా పథకం ద్వారా ఇప్పటివ రకు సిరిసిల్లలో 129 మందికి రూ 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తం గా చేనేత కార్మికులకు రూ 25 కోట్ల మేర రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. పవర్‌లూమ్ పరిశ్రమకు విద్యు త్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడి సంస్థ అమలు చేయలేదని, ఎన్పీడీసీఎల్‌లోకి వచ్చిన 24 గంటల్లోనే 25 హెచ్‌పీల వరకు సబ్సిడీ అవకాశంకల్పించిందన్నారు.పవర్‌లూమ్‌లకు యూనిట్‌కు రూ 2 సబ్సిడీ అమలు చేయడం వల్ల మూతపడిన అనేక పవర్‌లూమ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. దీంతో యజమానులు, ఆసాములు, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పేరుకుపోయిన నేత రంగానికి సంబంధించిన రూ.400 కోట్లకు పైగా బకాయిలలో రూ.350 కోట్లకు పైగా చెల్లిం చి నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలి చిందన్నారు. 2025-26 సంవత్సరానికి సం బంధించిన చీరల బిల్లుల్లో 80శాతం చెల్లిం చామని, మిగిలిన 20 శాతం కూడా త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూదాన్ పోచంప ల్లిలో ఉన్న వస్త్రాల బకాయిల చెల్లింపుపైనా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెంది న సిరిసిల్ల జిల్లాలో నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రైతన్నలు, నేతన్నలు సహా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో శ్రీధర్‌బాబు, చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, జిల్లా కాంగ్రెస్ అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు దేవరాజు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు గోవిందు రవి, తాటిపా ముల దామోదర్, ఆడెపు భాస్కర్, మండల సత్యం, కొక్కుల శ్రీనివాస్, వేముల దామోదర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడేపు చంద్రకళ, తహసీల్దార్ మహేష్, మున్సిప ల్ కమిషనర్ ఖదీర్ పాషా, చేనేత, వస్త్ర పరిశ్రమ పారి శ్రామికులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.