Share News

సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:05 AM

రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ’అరైవ్‌- అలైవ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సీఐ శ్రీనివాస్‌ అన్నారు.

సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం

ఎల్లారెడ్డిపేట, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ’అరైవ్‌- అలైవ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సీఐ శ్రీనివాస్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌ గ్రామంలో బుధ వారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి, సర్పంచ్‌ నాగ రాజు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఎస్సై రమేష్‌ అన్నారు. అరైవ్‌ అండ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత, క్రీడాకా రులు ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై వివ రించారు. పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 12:05 AM