Share News

పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యం..

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:39 AM

పేదల సొం తింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యం..

చందుర్తి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : పేదల సొం తింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధివారులు గృహప్రవేశ కార్యక్రమం గురువారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రా లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభు త్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఫోర్‌లైన్‌..

వేములవాడ నుంచి కోరుట్ల(ఎఖీన్‌పూర్‌) వరకు ని ర్మించనున్న 100ఫీట్ల నాలుగు వరుసల రహదారి పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతోనే మంజూరైందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్ప ష్టంచేశారు. ఈ రహదారి మంజూరును కేంద్ర ప్రభుత్వ నిధులుగా చూపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్ర చారం పూర్తిగా దుష్ప్రచారమన్నారు. ఈ రోడ్డు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రాష్ట్ర స్థాయిలోనే అమల వుతోందన్నారు. సుమారు 160 పైచిలుకు కోట్లతో ఈ రహదారి చందుర్తి, రుద్రంగి, కథలాపూ ర్‌, సిరికొండ మార్గంగా ఎఖీన్‌పూర్‌ వరకు విస్తరించ నుందని, రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్‌ యా న్యుటీ మోడల్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణం సమీకరించి ఈ పనులను చేప డుతోందన్నారు. ఇదే విధంగా మోతురా వుపేట నుంచి చందుర్తి వరకు రూ.15 కోట్లతో రహదారి పనులు కూడా చేప ట్టినట్లు వెల్లడించారు. గతంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కలిసిన పాత వీడియోలను చూపిస్తూ ఈ రహదారి తామే తీసుకువచ్చినట్లు చెప్పడం ప్రజ లను తప్పుదారి పట్టించడమేనని విమ ర్శించారు. మీరు కేంద్రం నుంచి నాలుగు వరుసల రహదారి తీసుకువస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన పనులను కేంద్రం పేరుతో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింతనంటి రామస్వామి, కాంగ్రెస్‌ నామకుడు బండారి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:39 AM