Share News

పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:39 AM

పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌స్‌ అన్నారు.

పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యం
లబ్ధిదారులకు దుస్తులు అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రుద్రంగి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌స్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదా రులకు నూతన వసా్త్రలను అందజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ మాట్లాడు తూ, పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ గండి నారాయణ, మార్కెట్‌ కమిటి చైర్మన చెలుకల తిరుపతి, ఉప సర్పంచ మాడిశేట్టి ఆభిలాష్‌, గట్ల మీనయ్య, తర్రె మనోహర్‌, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌ రెడ్డి, కేసిరెడ్డి నర్సారెడ్డి, కోమిరె శంకర్‌, ఎర్రం రాజలింగం, తర్రె లింగం, దవ్యాల రవి, గంధం మనోజ్‌, శీలం మీనయ్య, పల్లి గంగాధర్‌, సూర యాదయ్య, వంగ మనోజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:39 AM