పేదల సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:44 PM
పేదల సొంతింటి కల ను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : పేదల సొంతింటి కల ను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. మామిడిపల్లి గ్రామంలో శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ కులస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కాటమయ్య కిట్లను (సేఫ్టీ మోకులు) పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రద మైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సర్పంచులు కొంటెల్లి నాగరాజు, పన్నాల లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, అధికారులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధరెడ్డి, సత్యం, చేపూరి గంగాధర్, అబ్దుల్ రషీద్, గొట్టే రుక్మిణి, కే.బాల్‌రెడ్డి, ఉప్పుల శ్రీనివాస్, బాదినేని బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.