Share News

హరిత వారసత్వం అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:06 AM

భవిష్యత్‌ తరాలకు హరిత వారసత్వం అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు.

హరిత వారసత్వం అందించడమే లక్ష్యం

చందుర్తి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ తరాలకు హరిత వారసత్వం అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆన్నారు. చందుర్తి మండ లం సనుగుల గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ నగేష్‌, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనా రాయణలతో కలిసి గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో నేడు వన మహోత్సవం నిర్వహించుకోవడం శుభ పరిణామం అని అన్నారు. మొక్కలు నాటడం వరకే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారన్నారు. ప్రజలందరూ అటవీ శాఖ అధికారు లు చెప్పేది వినాలని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన అటవీ అన్యాక్రాంతం చేయాలని చూస్తే అధికారులకు సమాచారం అందిస్తుం దని, గతంలో ఉన్న పోడు భూములు విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్ట కుండా నూతనంగా అడవి అక్రమనకు గురి కాకుండా చూడాలని అటవీ శాఖ అధికారులకు విప్‌ సూచించారు. రాజన్న ఆలయానికి అతి దగ్గరగా ఉన్న చందుర్తి మండల కేంద్రంలో 176 సర్వే నంబర్‌లో ఏకో పార్క్‌లాంటి నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు, అటవీశాఖ అధికారులకు ప్రజలు సహకారం అందించాలని తెలిపారు. సనుగుల గోవిందారాజుల స్వామి వారి ఆలయం ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎంతో మేలు చే స్తుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రెండు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకంపై, కేర ళ ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మొదటి సంత కం చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొడిగె లావణ్య, ఎంపీడీవో రాధ, మాజీ జడ్పీటీసీ నాగంకుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:06 AM