Share News

ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:30 AM

శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటికీగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని దాంతో పాటు ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడమే లక్ష్యం
సుల్తానాబాద్‌ 12వ వార్డులో శానిటేషన క్లీనింగ్‌ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

- ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

సుల్తానాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటికీగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని దాంతో పాటు ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బుధవారం శానిటేషన క్లీనింగ్‌ కార్యక్రమాన్ని విజయరమణారావు ప్రారంభించారు. ఒకటో వార్డులో మహిళ సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్‌ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే ద్యేయంగాపని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు, డివైడర్ల ఏర్పాటు, హైమస్ట్‌ లైట్లు, సెంట్రల్‌ లైటింగ్‌ వంటి పనులు చేశామన్నారు. ఇంకా పలు వార్డులలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతం వారికి ఉపాధి ఆవకాశాల కల్పన తదితర అంశాలపై కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన అంతటి అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన బిరుదు రాధాక్రిష్ణ, వైస్‌ చైర్‌పర్సన పుష్పలత, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, ఈర్ల స్వరూప శేఖర్‌, సొసైటీ చైర్మన శ్రీగిరి శ్రీనివాస్‌, ఊట్ల వరప్రదీప్‌, దుగ్యాల సంతోష్‌ రావు, సిద్ధ తిరుపతి, చింతల రాజు, అబ్బయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

సుల్తానాబాద్‌ పట్టణంలోని సాయిబాబా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అయనకు స్వాగతం పలికి అశీర్వచనం చేశారు.

మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ

సుల్తానాబాద్‌ పట్టణంలోని జవహర్‌నగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ భార్గవ కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం వారి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - Jul 09 , 2026 | 12:30 AM