Share News

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:13 AM

జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్‌పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధి కారులతో సమీక్షించి రాజకీయ నాయకుల నుంచి అభి ప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో అర్హులు ఓటు హక్కు కోల్పోకూడదనేదే జిల్లా యంత్రాంగం లక్ష్యమని పేర్కొన్నారు. ఏఎస్‌డీడీ కింద 58567మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపి ణీ, అలాగే సేకరణ ఈ నెల18వ తేదీన మొదలై 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎన్యూమరే షన్‌ క్లెయిమ్‌, అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్‌ 15వ తేదీ వరకు చేస్తారని, తుది ప్రచురణ డిసెంబర్‌ 22 తేదీన ఉంటుందని వెల్లడించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకో వచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతిని ధులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీ వోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పక్కాగా సర్వే పూర్తి చేయాలి

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను కచితత్వంతో పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు. కలెక్టరేట్‌లో భూముల రీసర్వే ప్రక్రియ పురోగ తిపై తహసీల్దార్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ సమీక్షించారు. జిల్లాలోని ఆయా మండ లాల్లో ఇప్పటివరకు రీసర్వే చేపట్టిన గ్రామాలు, పురోగ తిపై కలెక్టర్‌ ఆరా తీశారు. గ్రామ హద్దులు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, నీటి వనరుల రీ సర్వేపై అడిగి తెలుసుకుని తహసీల్దార్‌లకు సూచనలు చేశారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ గ్రామా ల సరిహద్దు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, రెవెన్యూ, అట వీశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టా లని సూచించారు. ప్రతి గ్రామంలో సర్వే చేసే విషయా లను రైతులకు జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం నాలుగు రోజుల ముందు చెప్పాలని, రెండు రోజుల ముందు జెండాలు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. రైతుల సమక్షంలో వారి భూముల రీసర్వే చేసి.. ఆ వివరాలను వారికి తెలియజేసి సంతకాలు తీసుకోవాలని ఆదేశి చారు. అదనపు కలెక్టర్‌, ఆర్డీవోలు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జిల్లా అధికారి, డీఐలు, తహసీల్దార్లు భూముల రీసర్వే చేపడుతున్న గ్రామాలలో పర్యటించి, ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రీ సర్వేతో ఉపయోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు. భూములకు సంబంధించిన సమాచారం తప్పులు లేకుండా, పకడ్బందీగా సేకరించాలని ఆదేశించారు. రోజువారీగా పనులు చేపట్టి.. పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి సర్వే అండ్‌ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, డీఐలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:13 AM