టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:07 AM
ఆధ్యాత్మిక కేంద్రంగా, టెంపుల్ సిటీగా వేములవాడను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, అక్టోబరు 25 (ఆంధ్ర జ్యోతి): ఆధ్యాత్మిక కేంద్రంగా, టెంపుల్ సిటీగా వేములవాడను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేము లవాడ మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు చేపడుతున్న 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను ఆది వారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధి రెండు కళ్లలాంటివని, రెండిటిని సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతోనే ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో రూ. 150 కోట్ల నిధులతో పనులు ప్రారంభమై 55 శాతం వరకు పూర్తి అయ్యాయని అన్నారు. తాజాగా మరో రూ. 99.40 కోట్లు నిధులు మంజూరు కావడంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేములవాడ 80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పయిన నిర్వాసితులకు రూ.47కోట్లు మంజూరు జీవో తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని, రోడ్డు నిర్మా ణానికి సుమారుగా రూ.6.5 కోట్లతో పాటు విద్యుత్ స్తంభాలు, లైటింగ్ ఏర్పాట్లకు నిధులు కేటాయించామని తెలిపారు. నిర్వాసితుల సహకారం, త్యాగం మరువలేని దని, నిర్వాసితుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవు తోందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధి కారులను ఆదేశించారు. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా సాంకేతిక ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడో బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, తెలి పారు. అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి సుమారుగా రూ.2వేల కోట్లకు పైగా ప్రభుత్వం నిధులు కేటాయిం చిందని చెప్పుకొచ్చారు. భక్తుల విశ్వాసాలు, సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలను అభి వృద్ధి చేస్తున్నామని అన్నారు. వారి వెంట ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఈ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మ న్ నరాల శేఖర్, కౌన్సిలర్లు తూమ్ మధు, కాశ శ్రీనివాస్, ఇప్పపూల మమత-అజయ్, కొండ రాజశేఖర్, కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, పీరమహ్మద్ తదితరులు ఉన్నారు.