ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:36 AM
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్‌పై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగహన కల్పించ డమే తమ లక్ష్యమని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు.
వేములవాడ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్‌పై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగహన కల్పించ డమే తమ లక్ష్యమని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. పట్టణంలోని 15వ వార్డులో ఆదివారం ఇంటింటికి వెళ్లి ప్రజలక ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమో దైన ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన సవరణలు చేసుకునేలా అవగహన కలిగి ఉండాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఎస్‌ఐఆర్ ప్రక్రియన నిర్ల క్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొని తమ ఓటరు వివరా లను పరిశీలించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌వోలు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.