Share News

జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:44 PM

జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా అధికారులు పనిచేయాలని రవాణారోడ్డు భవనాల స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు.

జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

సిరిసిల్ల అర్బన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా అధికారులు పనిచేయాలని రవాణారోడ్డు భవనాల స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, పోలీస్‌ శాఖ, జాతీయ రవాహదారి శాఖల అధికారులతో కలిసి రవాణా, రోడ్లు, భవనాల స్సెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌ కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్‌ చేయవద్దని సూచించారు. నిర్ధేశిత ప్రాంతాలు మినహా ఎక్కడా కూడా వాహనాలు పార్కింగ్‌ చేయవద్దని స్పష్టం చేశారు. అలా గే రోడ్డు అక్రమణలు ఉండకుండా చూడాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా పోలీస్‌లు జాతీయ రహదారుల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పా టుచేయాలని ఆదేశించారు. అలాగే జాతీయ రహదారుల వెంట పోలీస్‌, రవాణా శాఖఅధికారుల పెట్రోలింగ్‌ వాహనాలు ఎప్పుడూ పర్యవేక్షించాలని సూచించారు. వాహనంలో అత్యవసర సేవలందించే సామగ్రి అందుబాటులో ఉండాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ జిల్లా పరిధిలోని అన్ని అసుపత్రుల వివరా లు, ట్రామా కేర్‌ సెంటర్ల వివరాలు మ్యాపింగ్‌ చేసి అత్యవసర సమయంలో అం దుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలోని బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కింద జారీ చేసిన ఆదేశాలను జిల్లాలో పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ జాతీయ రహదారుల వెంట గుర్తించి బ్లాక్‌ స్పాట్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నాన్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై ఆరా తీసి భవిష్యత్తు ప్రణాళికలపై దిశా నిర్ధేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, ఆర్‌అండ్‌బీ డీ శాంతయ్య, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:44 PM