Share News

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - May 03 , 2026 | 12:06 AM

తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పథకాలను రూపకల్పన చేస్తుందని వేములవాడ, ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం

వేములవాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పథకాలను రూపకల్పన చేస్తుందని వేములవాడ, ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో కలిసి హాజర య్యారు. ముందుగా జ్యోతిప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ వీడియో పాటను, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పనులపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళికలో గ్రామంలో గ్రామ సభలు, మండల స్థాయి సభలు పూర్తి చేసుకుని నియోజకవర్గ స్థాయిలో సభలు ఏర్పాటు చేసి భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభల్లో గుర్తించిన సమస్యలను పరిష్కా రం కోసం కృషి చేస్తున్నామన్నారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నామని, వారందరికీ అభినందనలు తెలియజేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయా ణం కల్పించామని, సుమారుగా రూ.10 వేల కోట్లు మహిళలకు ఆదా అయ్యాయని వివరించారు. మహిళ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని, విద్య, వైద్యసేవలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్‌, స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పా రు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో గంజాయి రహితంగా మారుస్తున్నారని తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయని, త్వరలోనే కుడి ఎడమ కాలువ నిర్మాణ పనులు చేయిస్తామని వివరించారు. మర్రిపెల్లి ప్రాజెక్ట్‌లో ఈ వర్షకాలం నీరు నిల్వ చేస్తామని, మల్కపేట రిజర్వాయర్‌ మిగతా పనులు పూర్తిచేస్తామని, మిడ్‌ మానేరు ముంపు గ్రామాల వాసుల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రుద్రంగికి అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు అయిందని తెలిపారు. జిల్లాలో రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు.

విజయవంతంగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక

సీఎం రేవంత్‌రెడ్డి మార్చి 6వ తేదిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని అప్పటి నుంచి జిల్లాలో విజయవంతంగా కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తా చెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని అన్నారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పోలీస్‌, రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని తెలిపారు. విద్యా ర్థులకు తమకు ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకు న్న లక్ష్యం చేరుకోవాలని, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. డ్రాప్‌ ఔట్‌ కావద్దని స్పష్టం చేశారు. మూడేండ్ల వయసు, ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడిగుడ్లు, బాలామృతం, ఇక్రిశాట్‌ వారి సూచ నల మేరకు రూపొందించి స్నాక్స్‌, పాలు, పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, మార్కెట్‌ కమిఈ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌ ఆర్డీవో రాధాబాయి, సీపీవో శ్రీనివాసచారి, డీఎస్పీ శ్రీని వాసులు, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - May 03 , 2026 | 12:06 AM