‘మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం’
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:49 AM
మహిళల ఆర్థిక స్వావంలంబనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రాయికల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వావంలంబనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు రాయికల్ పట్టణ మహిళల స్వశక్తి సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42 సంఘాలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి సుమారు రూ.11 లక్షల వడ్డీ లేని రుణాల జంబో చెక్కును మహిళలకు అందజేశారు. అలాగే రూ.7 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.1 కోటితో మున్సిపల్ పార్క్ అభివృద్ధి, రూ.20 లక్షలతో డివైడర్ పనులు, రూ.3.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, రూ.కోటితో పట్టణంలో జంక్షన్‌ల అభివృద్ధి, రూ.5 కోట్లతో స్మార్ట్ వాటర్ డ్రైనేజీకి నాలుగు చోట్ల పెద్ద డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. మహిళా స్వశక్తి సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి, చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకునేలా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు. మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు పునాదిలాంటివారని, వారు బలపడితే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గత ప్రభత్వాలకంటే భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. రాయికల్ మార్కండేయ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయికల్ పట్టణానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.4 లక్షల 50 వేల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఆర్డీవో మధుసూదన్, కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మెప్మా ఏవో శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవిఅచ్యుతరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రావు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణిసురేందర్ నాయక్, మండల, పలువురు పట్టణ నాయకులు పాల్గొన్నారు.