మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:55 AM
మహి ళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహి ళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాజారాం పల్లిలో సర్పంచ్ సంగ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేక్‌కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వ హిం చారు. ఈసందర్భంగా రాజారాంపల్లిలో మహి ళలకు అమణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు, పరపతి సహకార సం ఘం నూతన భవనాన్ని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని కోటి మంది మహిళలను కోటీశ్వరుల చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు నడిపించుకునే అవకాశం కల్పించడంతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. మహిళలకు అండగా ఉండా లని ముఖ్యమంత్రి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై తొలి సంతకం చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు సంఘటి తంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని పిలుపుని చ్చారు. రాజారాం పల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి చెంద డానికి సహకరిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమా ర్ హామీ ఇచ్చారు. గ్రామంలో మటన్ ప్రాసె సింగ్ యూనిట్‌తో పాటు మరిన్ని పథకాలను తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరణ్, తహశీ ల్దార్ అనిల్, ఎంపీడీవో కృపాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక జితేంధర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శైలేంధర్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మద్దుల గోపాల్‌రెడ్డి, కోటి లింగాల ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమే ష్, ఏపీఎం తులసీమాత, నాయకులు పాల్గొన్నారు.