Share News

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:23 AM

చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

బోయినపల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభి వృద్ధి కార్యమాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. కోధూరుపాక గ్రామంలో వారంతా, నూతన అంగన్‌వాడీ నిర్మాణంతో పాటు పలు అభి వృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం కోరెం కొండ పోచమ్మ ఆలయం వరకు వేసిన సిమెంట్‌రోడ్డు, సింగిల్‌ఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ను ప్రారంభించారు. పోచమ్మ తల్లినీ దర్శించుకుని మొక్కలు చెల్లించుకు న్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ముదుగంటి సురేం దర్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కొట్టేపల్లి సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ బోయిని ఎల్లేష్‌ యాదవ్‌, వైస్‌చైర్మన్‌ నిమ్మ వినోద్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వన్నె ల రమణారెడ్డి, నాయకులు సువిన్‌యాదవ్‌, నాగుల వంశీ, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:24 AM