వైౖభవంగా దుర్గాభవానీ సుందరేశ్వరుల కల్యాణం
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:50 PM
కరీంనగర్ మండలం నగునూర్ శివారులోని దుర్గాభవానీ సుందరేశ్వరుల కల్యాణాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మండలం నగునూర్ శివారులోని దుర్గాభవానీ సుందరేశ్వరుల కల్యాణాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పండితులు రుద్ర హోమం, చండీహోమం, మహా పూర్ణహుతి జరిపించారు. శంకరాచార్య జయంతిని పురస్కరించుకుని ఆదిశంకరాచార్యులకు విశేష అభిషేకం, విశేష హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కమిటీ భాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, పడకంటి వినోద్, హరిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.