ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:45 AM
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ జన్మదినంతో పాటు ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఈనెల 7న ఘనంగా జరుపుకోవాలని ఎంఎస్‌పీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాన పురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
గంభీరావుపేట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ జన్మదినంతో పాటు ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఈనెల 7న ఘనంగా జరుపుకోవాలని ఎంఎస్‌పీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాన పురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గంభీరావుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్‌పీఎస్ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కానపురం లక్ష్మణ్ మాట్లాడుతూ గో టూ విలేజ్ 40రోజుల కార్యక్రమంలో విద్య ప్రాము ఖ్యత ప్రధాన అంశంగా తీసుకోనున్నట్లు తెలిపారు. మాదిగ జాతిలో ఉన్న నిరక్ష రాస్యత శాతాన్ని తగ్గించి అందరూ చదువుకొని వర్గీకరణ ఫలాలను అందుకోవా లన్నారు. మంద కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపును అనుసరించి ప్రతి గ్రామంలో వివిధ కుల సంఘాల నాయకులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా వికలాంగు లను ఆహ్వానించి అందరి సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టా లన్నారు. దాదాపు 32 ఏళ్ళ నుంచి ఒక్క మాదిగ జాతికే కాకుండా తన పోరా టాన్ని సమాజంలో జరిగిన ప్రతి ఉద్యమానికి విస్తరించి సబ్బండ వర్గాల ప్రజ లకు దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సామాజిక న్యాయం దక్కాలని చెప్పిన ఉద్యమ నాయకుడు మంద కృష్ణ మాదిగనే అన్నారు. ఈ కార్యక్రమంలో మండ ల ఎంఆర్‌పీఎస్ మాజీ అధ్యక్షుడు బరుకుటం తిరుపతి, మాజీ ప్రధాన కార్యద ర్శి శనిగరపు నరేష్‌వర్మ, మాజీ ఉపాధ్యక్షులు ఇరిగి సందీప్, నాయకులు కత్తుల పెద్ద బాబు, గుండెళ్ళి బాలరాజు, పంగ బాలకృష్ణ, ఇరిగి పర్శరాములు, శనిగ రపు శ్రీనివాస్, శనిగరపు చంద్రం, ఇరిగి బాబు, ఇరిగి దేవరాజు, శనిగరపు వెంక టేష్, బండమీది సతీష్, నర్మాల దేవరాజు తదితరులు ఉన్నారు.